తెలుగు నుడి - Telugu Nudi - podcast cover

తెలుగు నుడి - Telugu Nudi

Sri Bharadwajpodcasters.spotify.com
తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం... ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

మన బారిష్టర్ గారు..!!

ఈ భాగంలో " బారిష్టర్ పార్వతీశం " హాస్య కథ నుంచి ఒక చక్కని సన్నివేశం వింటాము. ఇది వ్రాసింది శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. విని హాయిగా తెలుగులో నవ్వుకోండి....

Oct 05, 202013 minSeason 1Ep. 9

రాముడు చెప్పిన రామాయణం

ఈ భాగంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అనువాద నాటకం " ఉత్తర రాఘవము " లోని సీతారామ లక్ష్మణుల నడుమ జరుగు సంభాషణ. విని ఆనందించండి.

Oct 03, 202018 minSeason 1Ep. 8

ఎన్నాళ్ళు తిరిగేది?

ఈ ప్రసరణలో , త్యాగరాజ స్వామి వారి కీర్తన ' ఎన్నాళ్ళు తిరిగేది ' లోని సారాంశాన్ని, అందులోని తెలుగు పదరత్నాలను విందాము

Sep 29, 20205 minSeason 1Ep. 7

దీన విహంగ సందేశం

ఈ భాగంలో ' నవయుగ కవి చక్రవర్తి ' గుఱ్ఱం జాషువా వారి ' గబ్బిలం ' ఇతివృత్తం తెలుసుకొని, అందులో కొన్ని పద్యాలు పరిచయం చేసుకుంటాము..

Sep 28, 202013 minSeason 1Ep. 6

గత వారపు నెమరు - పరిచయం

ఈ శీర్షికన వెలువడే ప్రసరణలలో , ఆ ముందు వారం లో విడుదల అయిన అంశాలు, వాటి గురించి క్లుప్తంగా తెలుసుకొనే వీలు ఉంటుంది. ఇది తేదీల పరంగా అమర్చడం జరుగుతుంది.

Sep 27, 202057 sec

మౌనంగా పలుకవా బాలూ

ఈ భాగాన్ని 25-Sep-2020 న పుణ్యలోకాలకు తన గానామృతం పంచడానికి కదిలిన S.P.B, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మన బాలూ కి అంకితం చేస్తూ.. నా భావాలను పంచుకుంటున్నాను..

Sep 26, 20204 minSeason 1Ep. 5

కృష్ణాతీరాన మట్టి మాటలు

ఈ ప్రసరణ లో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కలం నుంచి జాలువారిన ' కృష్ణాతీరం ' నవలలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుంటాం. విని ఆనందించండి.

Sep 24, 20208 minSeason 1Ep. 4

' అగ్నిధార ' లో తెలుగు వెలుగులు

' ప్రజాకవి ' దాశరథి కృష్ణమాచార్య తన జైలు జీవితం నుండి నెమరు వేసుకున్న కవితలు ' అగ్నిధార ' ఖండకావ్యం. అందులో ఉన్న ఒక కవిత ' జైల్లో ' . అదే ఈ భాగంలోని అంశం.ఇందు చెప్పబడిన భావములో ఏదైనా సవరణలు ఉంటే ప్రాజ్ఞులు rangabharath@gmail.com ద్వారా తెలుపగలరు.

Sep 23, 20206 minSeason 1Ep. 3

బధిర బాధ

ఈ భాగంలో, చిలకమర్తి వారి ' ప్రహసనములు ' లో ' బధిర చతుష్టయం ' నాటకం నుండి చిన్న సన్నివేశంలో సంభాషణని విందాము. మీకు ఈ భాగంలో ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉంటే rangabharath@gmail.com కి విద్యుల్లేఖ వ్రాయగలరు Ref: Manasa publications వారి ప్రహసనములు

Sep 22, 20206 minSeason 1Ep. 2

తెలుగు విద్యార్థీ

ఈ భాగం లో మనం ఒక పద్యాన్ని చదువుకుందాం. ఇది కరుణశ్రీ గారి ' ఉదయశ్రీ ' లోనిది.

Sep 21, 20204 minSeason 1Ep. 1
For the best experience, listen in Metacast app for iOS or Android